Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీబీఐ పేరుతో కిడ్నాప్‌.. ఐదుగురి అరెస్ట్‌

Shruthi Nov 15, 2026 9:06 PM కడపGeneral
Add as a preferred source on Google
సీబీఐ పేరుతో కిడ్నాప్‌.. ఐదుగురి అరెస్ట్‌ - Ushodayam
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీబీఐ అధికారులమంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సాధిక్‌ను కిడ్నాప్‌ చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11న అతన్ని కర్ణాటకకు తీసుకెళ్లి కేసు నుంచి తప్పించాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సాధిక్‌ బంధువులు, స్నేహితుల నుంచి రూ.26 లక్షలు తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు.

Comments

G
Loading comments...