Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధవటంలో ఐదు క్లస్టర్ల ఏర్పాటు

Anuroop Nov 13, 2026 10:12 AM కడపGeneral
Add as a preferred source on Google
సిద్ధవటంలో ఐదు క్లస్టర్ల ఏర్పాటు - Ushodayam
సిద్ధవటం మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణకు ఐదు క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో ఫణి రాజకుమారి తెలిపారు. మొదటి విడత ఎన్నికలకు ఈ నెల 13న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 15 నుంచి 17 వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా క్లస్టర్లలో ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు.

Comments

G
Loading comments...