Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధప్పపాలెంలో మురుగునీటితో ఆరోగ్య భయం

Anuroop Nov 13, 2026 10:40 AM కర్నూలుGeneral
Add as a preferred source on Google
సిద్ధప్పపాలెంలో మురుగునీటితో ఆరోగ్య భయం - Ushodayam
కోసిగి సిద్ధప్పపాలెంలోని మారెమ్మ ఆలయం పక్కన ఉన్న బావిలోకి ఎగువ వీధుల డ్రైనేజీ నీరు చేరుతోంది. నిల్వ ఉన్న మురుగునీటిలో పందులు సంచరిస్తుండటంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, అధికారులు వెంటనే బావిని శుభ్రం చేసి డ్రైనేజీ నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...