Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు

Anuroop Nov 10, 2026 8:37 AM నంద్యాలGeneral
Add as a preferred source on Google
శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు - Ushodayam
శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో నేటి నుంచి వచ్చే నెల 9 వరకు కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు గర్భాలయ, సామూహిక అభిషేకాలను నిలిపివేశారు. కార్తీక శని, ఆది, సోమవారాలతో పాటు పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో స్పర్శ దర్శనాలను రద్దు చేశారు. సాధారణ రోజుల్లో రోజుకు ఐదు విడతలుగా స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించారు.

Comments

G
Loading comments...