వార్తలకు తిరిగి వెళ్లండి
శిథిలావస్థలో మత్స్య గుండం వంతెన

హుకుంపేట మండలం మఠంలోని శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మత్స్య గుండంపై నిర్మించిన వంతెన పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకుంది. దీంతో భక్తులు, పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు.
వంతెనపై ప్రయాణిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వంతెనకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...
