వార్తలకు తిరిగి వెళ్లండి
సామూహిక పారాయణంతో గిన్నిస్ రికార్డు

దైవ కార్యాలకు ప్రతి ఒక్కరూ సమయాన్ని కేటాయించాలని చిన జీయర్ స్వామి పిలుపునిచ్చారు. ముచ్చింతల్ శ్రీరామనగరంలో జరుగుతున్న 70వ తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం భక్తులు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన గిన్నిస్ ప్రతినిధి జీయర్ స్వామికి ప్రశంసాపత్రం అందజేశారు. జానపద కళాప్రదర్శనలు, సంకీర్తనలు ఆకట్టుకోగా, సామాజిక సేవకులను స్వామీజీ సన్మానించారు.
Comments
Loading comments...
