వార్తలకు తిరిగి వెళ్లండి
సాగునీటి కోసం రైతుల ఎదురుచూపులు

శిరివెళ్ల మండలం జీనపల్లె రైతులు సాగునీటి కోసం కేసీ కెనాల్ 16వ లాకుపై రాత్రింబవళ్లు నిరీక్షిస్తున్నారు. ఆరుతడి పంటలు సాగు చేసిన తమ పొలాలకు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలువలో వస్తున్న నీటిని ఒకే వైపు మళ్లిస్తున్నారని, తమకు అన్యాయం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. 100 మందికి పైగా రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
Comments
Loading comments...
