వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.6.5 కోట్లతో చుక్కాయిపల్లి చెరువు అభివృద్ధి

కొల్లాపూర్ పట్టణంలోని చుక్కాయిపల్లి చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.6.5 కోట్లతో చేపట్టనున్న సుందరీకరణ పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం శంకుస్థాపన చేశారు.
చెరువు పరిసరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. ఈ అభివృద్ధితో పట్టణ ప్రజలకు విహార కేంద్రం అందుబాటులోకి రావడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...
