Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గల్లంతైన డిగ్రీ విద్యార్థి మృతి

Sai Nath Nov 23, 2026 2:57 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
గల్లంతైన డిగ్రీ విద్యార్థి మృతి - Ushodayam
విశాఖలోని రుషికొండ బీచ్‌లో శనివారం సముద్ర స్నానానికి దిగి గల్లంతైన బీకాం విద్యార్థి సయ్యద్ జాహిద్ రజా (19) మృతదేహం సోమవారం ఒడ్డుకు చేరింది. స్నేహితులతో కలిసి తీరానికి వచ్చిన అతడు అలల ఉధృతికి కొట్టుకుపోయాడు. పోలీసులు, మెరైన్ బృందాల గాలింపు అనంతరం మత్స్యకారుల వలలకు మృతదేహం చిక్కడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Comments

G
Loading comments...