వార్తలకు తిరిగి వెళ్లండి
రసగుల్లా అంటూ నాటుబాంబు.. కొరికిన వ్యక్తి మృతి

మధ్యప్రదేశ్‌లోని డిండౌరీ జిల్లా పడరియా గ్రామంలో నాటుబాంబు పేలడంతో రాజేంద్ర బరోటియా (35) మృతిచెందాడు. రసగుల్లా అంటూ బంధువు రామ్‌భగత్ ఇచ్చిన బాంబును చీకట్లో గుర్తించక నోట్లో పెట్టుకుని కొరకడంతో పేలుడు సంభవించింది.
తీవ్రంగా గాయపడిన రాజేంద్రను ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. పోలీసులు రామ్‌భగత్‌ను అదుపులోకి తీసుకుని, వ్యక్తిగత కక్షల కోణంలోనూ విచారణ చేపట్టారు.
Comments
Loading comments...
