వార్తలకు తిరిగి వెళ్లండి
రహదారి పక్కన ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్

సిర్పూర్(టి) మండలంలోని కర్జాపల్లి-లోనవెల్లి రహదారి పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. చుట్టూ రక్షణ కంచె, హెచ్చరిక బోర్డు లేకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా కంచె, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని విద్యుత్ అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...
