వార్తలకు తిరిగి వెళ్లండి
రెండు నెలల బాబుతో ప్రమాణ స్వీకారం

బాపట్ల జిల్లా చీరాల పురపాలక ఛైర్‌పర్సన్‌గా విజయం సాధించిన ఎరిచెర్ల హనీ స్పందన సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తన రెండు నెలల బాబును వెంట తీసుకొచ్చి పురపాలక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
బాలింతగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ముక్కోణపు పోటీలో విజయం సాధించారు. ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆమెను ఛైర్‌పర్సన్ కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...
