Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు గంటలు కృత్రిమ శ్వాస.. ప్రాణం నిలిపిన డాక్టర్‌

Shruthi Nov 14, 2026 10:19 AM ఖమ్మంGeneral
Add as a preferred source on Google
రెండు గంటలు కృత్రిమ శ్వాస.. ప్రాణం నిలిపిన డాక్టర్‌ - Ushodayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితికి చేరిన 17 ఏళ్ల బాలికను వైద్యులు కాపాడారు. డా. రాంప్రసాద్‌ అంబులెన్స్‌లో దాదాపు రెండు గంటలపాటు అంబు బ్యాగ్‌ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తూ భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. అక్కడి ఐసీయూలో బాలికకు చికిత్స అందించడంతో ప్రాణాలు నిలిచాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చర్ల సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ డా. సాయివర్ధన్‌ తెలిపారు.

Comments

G
Loading comments...