వార్తలకు తిరిగి వెళ్లండి
రేణిగుంట పనులతో రెండు రైళ్లు రద్దు

రేణిగుంట రైల్వే యార్డు పునర్నిర్మాణం, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా రెండు రైళ్లను 19 రోజులపాటు రద్దు చేశారు. గుంతకల్లు డివిజన్‌లో 48 రోజులపాటు ఈ పనులు చేపట్టనున్నారు.
పుదుచ్చేరి–తిరుపతి (16112) రైలు డిసెంబర్ 9 నుంచి 27 వరకు, తిరుపతి–పుదుచ్చేరి (16111) రైలు డిసెంబర్ 10 నుంచి 28 వరకు నడవవు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
Comments
Loading comments...
