Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్

Kiran Nov 10, 2026 6:12 PM వరంగల్General
Add as a preferred source on Google
రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్ - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో నష్టపోయిన జిల్లా రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ బాష్మియా డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట అన్ని మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. గీసుకొండ, నల్లబెల్లి, ఖానాపురం, రాయపర్తి, వర్ధన్నపేట మండలాలను కరవు మండలాలుగా గుర్తించి రైతులకు పంట పరిహారం చెల్లించాలని కోరారు.

Comments

G
Loading comments...