వార్తలకు తిరిగి వెళ్లండి
రైతు మేళాకు రెండు బస్సుల్లో రైతుల పయనం

వడ్డేపల్లి మండలం నుంచి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హకీంపేటలో నేడు జరగనున్న మెగా రైతు మేళాకు 100 మంది రైతులు రెండు ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరారు. మండల వ్యవసాయ అధికారి జె. రాధ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేశారు.
తనగల, జులేకల్, కొంకల గ్రామాల నుంచి 50 మంది, వడ్డేపల్లి, పైపాడు, రామాపురం తదితర గ్రామాల నుంచి మరో 50 మంది రైతులు మేళాకు వెళ్లినట్లు రాధ తెలిపారు.
Comments
Loading comments...
