Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు బజార్ బియ్యం ధరపై ఆరోపణలు

Anuroop Nov 11, 2026 2:48 PM ప్రకాశం General
Add as a preferred source on Google
రైతు బజార్ బియ్యం ధరపై ఆరోపణలు - Ushodayam
కందుకూరు రైతు బజార్‌లో 26 కిలోల సన్నబియ్యం బస్తా ధర రూ.1,274 కాగా, రూ.1,300 వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అదనపు వసూళ్లు ఎస్టేట్ అధికారికి ఆదాయ వనరుగా మారాయని విమర్శిస్తున్నారు. రోజుకు 200 బస్తాల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఎస్టేట్ అధికారి తెలిపిన నేపథ్యంలో, రోజుకు రూ.5 వేలు, నెలకు రూ.1.5 లక్షలకు పైగా అక్రమ ఆదాయం పక్కదారి పడుతున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...