వార్తలకు తిరిగి వెళ్లండి
రైస్ మిల్లులకే ధాన్యం

భిక్కనూర్ మండలంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా, ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల రైతులు రైస్ మిల్లులను ఆశ్రయిస్తున్నారు. వ్యాపారులు నిర్ణయించిన ధరకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
Comments
Loading comments...
