Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు జిల్లా జట్టు

Anuroop Nov 12, 2026 2:29 PM శ్రీకాకుళంGeneral
Add as a preferred source on Google
రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు జిల్లా జట్టు - Ushodayam
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ నెల 13 నుంచి 15 వరకు జరగనున్న 70వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ నెట్‌బాల్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా అండర్‌-17 బాలబాలికల జట్టు బయలుదేరింది. గురువారం టెక్కలి మండలం నౌపడ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణమైంది. క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని డీఈవో, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఏ.రవిబాబు, జిల్లా కార్యదర్శులు జగదీశ్, జ్యోతిరాణి ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...