వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు అశ్విని ఎంపిక

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి SGF ఖో-ఖో పోటీల్లో పెద్ద ఆదిరాల ZPHS 9వ తరగతి విద్యార్థిని అశ్విని అండర్-17 రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ పోటీలు రేపటి నుంచి 15వ తేదీ వరకు మేడ్చల్ జిల్లాలో జరగనున్నాయి.
పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని GHM మల్లయ్య, PD మోయిన్ ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు, గ్రామస్థులు అశ్వినిని అభినందించారు.
Comments
Loading comments...
