వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థి ఎంపిక

మొగుళ్లపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతున్న దానవేన విగ్నేష్ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 9న భూపాలపల్లి అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచాడు.
ఈ నెల 12, 13, 14 తేదీల్లో వికారాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పీడీ గుండెల్లి రాజయ్య తెలిపారు. విగ్నేష్‌ను ఉపాధ్యాయులు అభినందించారు.
Comments
Loading comments...
