వార్తలకు తిరిగి వెళ్లండి
రాపూరు ఘాట్‌లో చిరుత సంచారం

చిట్వేల్–రాపూరు ఘాట్ రోడ్డులో గత రెండు నెలలుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో రాజంపేటకు చెందిన ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా, రహదారి పక్కన రక్షణ గోడపై చిరుత కూర్చొని కనిపించినట్లు తెలిపారు.
రాత్రివేళల్లో చిరుత రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉండటంతో బైకర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
Comments
Loading comments...
