Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంబిల్లిలో 8 చోట్ల నామినేషన్ల స్వీకరణ

Anuroop Nov 11, 2026 8:59 AM అనకాపల్లి General
Add as a preferred source on Google
రాంబిల్లిలో 8 చోట్ల నామినేషన్ల స్వీకరణ - Ushodayam
పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల కోసం రాంబిల్లి మండలంలో 8 నామినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారిణి జయ మాధవి తెలిపారు. కట్టుబోలు, దిమిలి, గోకివాడ, రాజకోడూరు, నరసాపురం, గోవిందపాలెం, రాంబిల్లి, వెల్చూరు స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. డిసెంబర్‌ 2న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...