Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామసముద్రం MPP పీఠంపై ఉత్కంఠ

Anuroop Nov 12, 2026 11:04 AM అన్నమయ్యGeneral
Add as a preferred source on Google
రామసముద్రం MPP పీఠంపై ఉత్కంఠ - Ushodayam
రామసముద్రం మండల పరిషత్ అధ్యక్ష (MPP) పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 14 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ 7, టీడీపీ 6, జనసేన 1 స్థానం గెలుచుకున్నాయి. దీంతో ఇరు వర్గాల బలం చెరో ఏడుకు చేరింది. MPP పీఠాన్ని దక్కించుకునేందుకు నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎంపీటీసీల మద్దతు కూడగట్టేందుకు తెరవెనుక మంతనాలు సాగిస్తున్నారు. దీంతో మండలంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...