వార్తలకు తిరిగి వెళ్లండి
రామన్నపేటలో న్యాయ సేవా దినోత్సవం

నవంబర్ 9 న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా రామన్నపేట మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష ఉచిత న్యాయ సహాయం, చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించారు.
న్యాయం ఎలా పొందాలి, సమస్యలను ఎవరికి తెలియజేయాలనే అంశాలను వివరించారు. కార్యక్రమంలో ప్యానల్ అడ్వకేట్ కూనూరు శ్రీనివాస్, ALAC శ్రీశైలం, PLV యాదయ్య పాల్గొన్నారు.
Comments
Loading comments...
