వార్తలకు తిరిగి వెళ్లండి
రాజేంద్రనగర్‌లో ప్రమాదకరంగా మ్యాన్‌హోల్

రాజమండ్రి రాజేంద్రనగర్‌లో రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా మారింది. దీంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాల్సిన అధికారులు కర్రకు గుడ్డ కట్టి వదిలేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రివేళ ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...
