వార్తలకు తిరిగి వెళ్లండి
రాజానగరం ఎంపీటీసీల్లో డిగ్రీ చదివింది 14 మందే

రాజానగరం నియోజకవర్గంలోని 71 మంది ఎంపీటీసీ సభ్యుల్లో 14 మందికి మాత్రమే ఇంటర్మీడియట్ ఆపై విద్యార్హతలు ఉన్నాయి. వీరిలో 24 మందికి ఎలాంటి విద్యాభ్యాసం లేదు. పదో తరగతిలోపు చదివిన వారు 33 మంది ఉన్నారు.
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వారు ఏడుగురు, డిగ్రీ చేసిన వారు మరో ఏడుగురు ఉన్నారు. ఎన్నికల్లో పార్టీలు సామాజిక వర్గాల సమీకరణాలు, అభ్యర్థుల ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి టికెట్లు కేటాయించడం గమనార్హం.
Comments
Loading comments...
