వార్తలకు తిరిగి వెళ్లండి
రాహుల్‌పై నితిన్ నబీన్ తీవ్ర విమర్శలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై ఇండియా కూటమి రాద్ధాంతం చేస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. కరీంనగర్‌లో నిర్వహించిన భాజపా మహాపాదయాత్రలో ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీకి దేశాభివృద్ధి కంటే కుటుంబ అభివృద్ధే ముఖ్యమని, రేవంత్ రెడ్డి ఆయనకు ఏటీఎంలా పనిచేస్తున్నారని ఆరోపించారు.
అంతకుముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో భాజపా రాజ్యం రావాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...
