వార్తలకు తిరిగి వెళ్లండి
రాఘాపూర్లో ముగిసిన దండారి ఉత్సవాలు

సిర్పూర్ (యు) మండలం రాఘాపూర్లో పది రోజులుగా కొనసాగిన సంప్రదాయ దండారి ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం గ్రామ మహిళలు, దండారి బృందం సోయంగూడకు చేరుకోగా గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.
మహిళలు సంప్రదాయ జల్కా నృత్యాలతో సందడి చేస్తూ గోండు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పారు.
Comments
Loading comments...
