వార్తలకు తిరిగి వెళ్లండి
పత్తికొండలో ఘనంగా బాలల దినోత్సవం

పత్తికొండ: చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని శనివారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తికొండలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో కేపిఆర్ మైత్రి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రామ్మోహన్ పిల్లలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు, దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అంటూ విద్యార్థులను ఉత్తేజపరిచారు.
పాఠశాల యాజమాన్యం ఆయన్ను ఘనంగా సత్కరించి, ఆయన సేవలను ఎంతో ప్రశంసించింది.
Comments
Loading comments...
