వార్తలకు తిరిగి వెళ్లండి
పరుగు పందెంలో అక్కాచెల్లెళ్లకు పతకాలు

హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తెలంగాణ ప్రీమియర్ లీగ్ అండర్-10 విభాగం 100 మీటర్ల పరుగు పందెంలో అయిజకు చెందిన అక్కాచెల్లెళ్లు రూపాశ్రీ, అన్విత పతకాలు సాధించారు. రూపాశ్రీ బంగారు పతకం, అన్విత వెండి పతకం గెలుచుకున్నారు.
వీరిద్దరూ గద్వాలలోని ఓ పాఠశాలలో చదువుకుంటున్నారు. వారి విజయంపై తల్లిదండ్రులు, అయిజ పట్టణ ప్రజలు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
