వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రొరోగ్ కాని పార్లమెంట్.. 88 రోజులుగా కొనసాగుతున్న రికార్డు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడి 88 రోజులు గడిచినా.. ఇప్పటికీ ప్రొరోగ్ కాలేదు. దీంతో 2008లో నమోదైన 87 రోజుల రికార్డు బద్దలైంది.
సాధారణంగా సభలు వాయిదాపడిన రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతి సమావేశాలను ముగిస్తూ ప్రకటన చేస్తారు. ఈసారి ఆగస్టు 13 నుంచి ఆ ప్రకటన వెలువడలేదు. దీంతో కొత్తగా సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్రపతి నుంచి మరోసారి పిలుపు అవసరం లేకుండా పోయింది.
Comments
Loading comments...
