వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రమాదంతో మంచానికే పరిమితమైన జేమ్స్

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్‌కు చెందిన తాళ్లపల్లి జేమ్స్ ఏడాదిగా ప్రమాదం కారణంగా మంచానికే పరిమితమయ్యారు. చికిత్స కోసం కుటుంబం ఎకరంన్నర భూమిని అమ్మి రూ.23 లక్షలు ఖర్చు చేసింది. మరో శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు.
దీనికి రూ.4 లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో నిరుపేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. భార్య జమున, కుమారుడు ఆయనకు సేవలు చేస్తున్నారు.
Comments
Loading comments...
