వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రజావాణికి ఏడుగురే అధికారుల హాజరు

భూదాన్ పోచంపల్లిలో సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి అధికారుల హాజరు తక్కువగా ఉంది. 18 నుంచి 25 మంది అధికారులు హాజరుకావాల్సి ఉండగా, ఉదయం 11 గంటలు దాటినా కేవలం ఏడుగురే వచ్చారు.
దీంతో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలు అధికారుల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించే కార్యక్రమానికి తగినంత మంది అధికారులు హాజరుకాకపోవడంపై అసంతృప్తి వ్యక్తమైంది.
Comments
Loading comments...
