Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోతేపల్లిలో ఘనంగా సదర్ ఉత్సవాలు

Kiran Nov 13, 2026 9:54 AM నాగర్ కర్నూల్General
Add as a preferred source on Google
పోతేపల్లిలో ఘనంగా సదర్ ఉత్సవాలు - Ushodayam
వెల్దండ మండలం పోతేపల్లిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో తొలిసారిగా సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతును డప్పు చప్పుళ్ల మధ్య గ్రామ వీధుల్లో ఊరేగించారు. సంప్రదాయ తలపాగాలు, వస్త్రధారణతో యువకులు, పెద్దలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సదర్ ఉత్సవాలు యాదవుల సంస్కృతి, ఐక్యతకు ప్రతీకలని తెలంగాణ సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, సర్పంచ్ కొండలు యాదవ్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...