వార్తలకు తిరిగి వెళ్లండి
పొన్నూరులో తృటిలో తప్పిన ప్రమాదం

పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు డాన్ బాస్కో స్కూల్ సమీపంలో బుధవారం కారు అదుపుతప్పి ఇనుప విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో 11 కేవీ విద్యుత్ తీగలు తెగి వేలాడాయి. అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
స్థానికులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
