వార్తలకు తిరిగి వెళ్లండి
పొగమంచుతో రెండు లారీల ఢీ

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో దట్టమైన పొగమంచు కారణంగా సోమవారం ఉదయం జాతీయ రహదారి 44పై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. డివైడర్ కనిపించకపోవడంతో ప్రమాదం జరిగింది.
లారీల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నా, ఇద్దరు డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, పొగమంచులో ఫాగ్ లైట్లు వాడుతూ వేగం తగ్గించాలని సూచించారు.
Comments
Loading comments...
