వార్తలకు తిరిగి వెళ్లండి
చందర్లపాడును కమ్మేసిన పొగమంచు

చందర్లపాడు మండలంలో సోమవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రహదారులు, పంట పొలాలు పొగమంచుతో కప్పుకుపోవడంతో కొద్దిదూరంలోని వస్తువులు కూడా కనిపించలేదు. దీంతో వాహనదారులు ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
చలిగాలుల ప్రభావంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఆలస్యం చేశారు. మరోవైపు ఉదయపు ప్రకృతి దృశ్యాలు ఆహ్లాదాన్ని పంచాయి.
Comments
Loading comments...
