Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొదలకూరులో భక్తిశ్రద్ధలతో నాగులచవితి

Anuroop Nov 13, 2026 10:03 AM నెల్లూరుGeneral
Add as a preferred source on Google
పొదలకూరులో భక్తిశ్రద్ధలతో నాగులచవితి - Ushodayam
పొదలకూరులోని శ్రీవినాయక, కామాక్షితాయి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం నాగులచవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని నాగదేవతలకు పసుపు, కుంకుమ, పాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు వడపప్పు, సద్దులు ప్రసాదంగా పంపిణీ చేశారు. కార్తీక మాసంలో నాగులచవితికి విశేష ప్రాధాన్యత ఉందని అర్చకులు తెలిపారు.

Comments

G
Loading comments...