వార్తలకు తిరిగి వెళ్లండి
పంట నష్టంపై రైతుల రాస్తారోకో

తుఫాన్ల ప్రభావంతో సముద్రపు నీరు చేలల్లోకి చేరి 300 ఎకరాల పంట మునిగిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం యూ.కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించారు.
దీంతో ఉప్పాడ–పిఠాపురం మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు పంట నష్టంపై సర్వే చేసి పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
Comments
Loading comments...
