వార్తలకు తిరిగి వెళ్లండి
పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

పంజాబ్‌లోని తరన్ తరన్ జిల్లా 54వ నంబర్ జాతీయ రహదారిపై తీర్థ యాత్రికులతో వెళ్తున్న రెండు ప్రభుత్వ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. బైక్‌ను తప్పించే క్రమంలో ఓ బస్సు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు, పోలీసులు కలిసి ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి తరన్ తరన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...
