వార్తలకు తిరిగి వెళ్లండి
PLFS సర్వేకు సహకరించాలని అధికారుల విజ్ఞప్తి

రామగుండం పట్టణంలో జాతీయ గణాంక కార్యాలయం ఆధ్వర్యంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS–2026) నిర్వహిస్తున్నట్లు గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీని కలిసి సర్వే కరపత్రాలను అందజేశారు.
ఉపాధి, నిరుద్యోగం, కార్మిక శక్తి భాగస్వామ్యం, స్వయం ఉపాధిపై వివరాలు సేకరిస్తామని తెలిపారు. సమాచారం గోప్యంగా ఉంచుతామని, ప్రజలు సర్వేకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...
