వార్తలకు తిరిగి వెళ్లండి
పీఎం స్వనిధి రుణాల కోసం వీధి వ్యాపారుల ఇబ్బందులు

నల్గొండలో పీఎం స్వనిధి పథకం కింద రుణాల కోసం అర్హులైన వీధి వ్యాపారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మున్సిపాలిటీ నుంచి ప్రొసీడింగ్స్ జారీ చేసి వారం రోజులు గడుస్తున్నా కొన్ని బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అర్హత ఉన్నప్పటికీ రుణాలు అందక ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి బ్యాంకుల తీరుపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...
