Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీళ్లలో పెట్రోల్‌ కలిసింది

Anuroop Nov 10, 2026 10:40 AM గుంటూరుGeneral
Add as a preferred source on Google
నీళ్లలో పెట్రోల్‌ కలిసింది - Ushodayam
గుంటూరు చుట్టుగుంట వీఐపీ రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌కు బదులు నీళ్లు వచ్చాయని వాహనదారులు ఆరోపించారు. రూ.520 పెట్రోల్ పోయించిన కొద్దిసేపటికే బైక్ ఆగిపోవడంతో మెకానిక్ వద్ద ఫ్యూయల్ పైప్ పరిశీలించగా నీరు బయటపడినట్లు తెలిపారు. బాటిల్‌లో సేకరించిన ఇంధనంలో పైన కొద్దిగా పెట్రోల్, కింద నీరు కనిపించాయని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి బంక్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...