వార్తలకు తిరిగి వెళ్లండి
పెనుగంచిప్రోలులో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి

పెనుగంచిప్రోలు మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో శుక్రవారం నాగుల పంచమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయాన్నే మహిళలు కుటుంబసమేతంగా గ్రామాల్లోని పుట్టల వద్దకు వెళ్లి పాలు పోసి, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రతి ఇంటి నుంచి మహిళలు పుట్టలకు ఆవు పాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...
