వార్తలకు తిరిగి వెళ్లండి
పేదలకు ఉచిత న్యాయ సేవలే లక్ష్యం

పొన్నూరు సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో సోమవారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లీగల్ సర్వీసెస్ డే నిర్వహించారు. పేదలకు ఉచిత న్యాయ సలహాలు, న్యాయవాదుల సేవలు అందించడమే సంస్థ లక్ష్యమని జూనియర్ సివిల్ జడ్జి రుక్మిణి తెలిపారు.
లోక్ అదాలత్‌ల ద్వారా సమయం, డబ్బు ఆదా చేసుకుంటూ కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...
