Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదమద్దూరు రహదారిపై ప్రమాదకర మలుపులు

Anuroop Nov 09, 2026 12:25 PM పల్నాడు General
Add as a preferred source on Google
పెదమద్దూరు రహదారిపై ప్రమాదకర మలుపులు - Ushodayam
అమరావతి మండలం పెదమద్దూరు నుంచి వైకుంఠపురం వెళ్లే మార్గంలోని రెండు యూ మలుపులు, వైకుంఠపురం సమీపంలోని ఎస్‌ మలుపు ప్రమాదకరంగా ఉన్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు దగ్గరకు వచ్చేవరకు మలుపులు కనిపించడం లేదని తెలిపారు. ముఖ్యంగా రాత్రివేళ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...