Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెబ్బేరులో బైక్ రేసింగ్‌పై నిఘా పెంచాలని విజ్ఞప్తి

Sai Nath Nov 20, 2026 3:57 PM వనపర్తిGeneral
Add as a preferred source on Google
పెబ్బేరులో బైక్ రేసింగ్‌పై నిఘా పెంచాలని విజ్ఞప్తి - Ushodayam
పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో కొందరు యువకులు బైకులతో అతివేగంగా ప్రయాణిస్తూ రేసింగ్‌లకు పాల్పడుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద వేగంగా నడపడం, సైలెన్సర్లతో భారీ శబ్దాలు చేయడం వల్ల వృద్ధులు, చిన్నారులు, మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా పెంచి, రేసింగ్‌కు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు పోలీసులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...