వార్తలకు తిరిగి వెళ్లండి
పద్మాక్షి ఆలయంలో నాగుల చవితి పూజలు

శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నాగుల చవితి పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు సర్పసూక్త పారాయణంతో పూర్ణాభిషేకం చేసి, అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
రాహు, కేతు, సర్పదోషాల నివారణకు ఆవుపాలతో పుట్టలో పాలు పోసి పూజించడం సనాతన సంప్రదాయమని వేద పండితులు తెలిపారు. కార్తీక మాస దీపారాధనలు, పర్వదినాల విశేషాలను నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని వివరించారు.
Comments
Loading comments...
