వార్తలకు తిరిగి వెళ్లండి
PCB అసిస్టెంట్ సైంటిస్ట్ అభ్యర్థులకు వైద్య పరీక్షలు

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన దివ్యాంగ అభ్యర్థులు ఈ నెల 13న ఉదయం 8 గంటలకు కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు హాజరుకావాలని టీజీపీఎస్సీ కార్యదర్శి సూచించారు.
అభ్యర్థులు సదరం ధ్రువపత్రం, రెండు ఫొటోలు, ప్రవేశ పత్రం తీసుకురావాలని తెలిపారు. మొత్తం ఐదుగురు అభ్యర్థులకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...
